Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నా: Raghuveera

అనంతపురం: మాజీ సీఎం రోశయ్య మరణ వార్త విని జీర్ణించుకోలేక పోతున్నానని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలకు రోశయ్య మరణం తీరని లోటన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని తెలిపారు. వింటే రోశయ్య ఉపనాస్యం వినాలి... తింటే గారెలు తినాలనే నానుడి ఉందన్నారు. ఆర్థికశాఖ మంత్రిగా దేశంలో ఒక గుర్తింపు పొందారని కొనియాడారు. రోశయ్యతో క్యాబినెట్‌లో కలిసి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. రేపు హ్తెదరాబాద్‌లో జరిగే అంత్యక్రియలకు హాజరవనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement