Kodali nani: రాజీనామాలు ఎప్పుడు చేయాలో మాకు తెలుసు...మీ సలహాలు అవసరం లేదు: కొడాలినాని
ABN , First Publish Date - 2022-07-29T18:07:45+05:30 IST
23 మంది వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.
విజయవాడ: 23 మంది వైసీపీ ఎంపీలు (YCP MPs) రాజీనామా చేయాలంటూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని(Kodali nani) స్పందించారు. ఎప్పుడు రాజీనామాలు చేయాలో తమకు, జగన్(Jagan)కు తెలుసని.. చంద్రబాబు సలహాలు తమకు అవసరం లేదని అన్నారు. ‘‘చంద్రబాబు ఉచిత సలహాలు మాని మీ పార్టీ ముగ్గురు ఎంపీలు, రాజ్యసభ సభ్యులచే రాజీనామా చేయించాలి’’ అని డిమాండ్ చేశారు. భారతదేశం(India)లోని అత్యంత పిరికి నాయకుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాలు చేయించి వైసీపీ ద్వారా గెలిపించిన చరిత్ర జగన్‌ది అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేను కాదు కదా సమస్యపై సర్పంచ్‌ను కూడా రాజీనామాను చేయించని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలంటే పారిపోయే చంద్రబాబు తమకు సలహాలు ఇవ్వడం హాస్యస్పదమంటూ కొడాలి నాని యెద్దేవా చేశారు.