Abn logo
Sep 27 2021 @ 03:32AM

నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతా

 మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల 


వీణవంక, సెప్టెంబరు 26: నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు వారి తరఫున పోరాటం చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లిలో ముదిరాజ్‌, గౌడ కులస్థులు సుమారు 150 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశ పడ్డ యువతకు నిరాశే మిగిలిందన్నారు. దళితులపై ప్రేమ ఉంటే వారి అకౌంట్లలో వేసిన రూ.10 లక్షలపై కలెక్టర్‌, బ్యాంకు అధికారుల పెత్తనం తీసివేయాలని, దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తాను రాజీనామా చేస్తేనే ఇక్కడ సర్పంచ్‌లకు నిధులు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు వచ్చాయని చెప్పారు.