సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి బండారు విమర్శలు

ABN , First Publish Date - 2021-07-25T18:28:56+05:30 IST

సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి బండారు విమర్శలు

సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి బండారు విమర్శలు

గుంటూరు: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శలు గుప్పించారు. బ్రోకరేజ్ పనులు చేసుకునే సజ్జల సిగ్గు లేకుండా చంద్రబాబుని విమర్శిస్తాడా? అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. విశాఖ ఉక్కుని కాపాడింది చంద్రబాబే అన్న విషయం సజ్జలకు తప్ప, ప్రతిఒక్కరికీ తెలుసని, గతంలో ప్రధాని వాజ్ పేయికి స్టీల్ ప్లాంట్ గొప్పతనం తెలియచేసి...దానికి సంబంధించిన నష్టాలను ఈక్వీటీగా మార్పించిన ఘనత చంద్రబాబుది అని బండారు అన్నారు.

Updated Date - 2021-07-25T18:28:56+05:30 IST