రాజధాని తరలింపు అసాధ్యం: మాజీ మంత్రి అమరనాథరెడ్డి

ABN , First Publish Date - 2020-08-09T15:00:25+05:30 IST

రాజధాని తరలింపు న్యాయపరంగా అసాధ్యమని, ఈ విషయం..

రాజధాని తరలింపు అసాధ్యం: మాజీ మంత్రి అమరనాథరెడ్డి

పలమనేరు(చిత్తూరు): రాజధాని తరలింపు న్యాయపరంగా అసాధ్యమని, ఈ విషయం సీఎం, మంత్రులకు తెలుసని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను చేస్తే భావితరాల భవిష్యత్‌ను నాశనం చేసినట్లే అన్నారు. చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా, ఇతర ప్రాంతాల పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారన్నారు. దేశంలోనే 15 అత్యున్నత సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేడు ఆ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ 13 జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. 


Updated Date - 2020-08-09T15:00:25+05:30 IST