కొత్తపల్లి గిరిజన బాలికపై అత్యాచారం కేసులో ప్రభుత్వం విఫలం: Amarnath

ABN , First Publish Date - 2021-10-04T19:54:14+05:30 IST

జిల్లాలోని గంగవరం మండలం కీలపట్ల కొత్తపల్లి గ్రామంలో గిరిజన బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

కొత్తపల్లి గిరిజన బాలికపై అత్యాచారం కేసులో ప్రభుత్వం విఫలం: Amarnath

చిత్తూరు: జిల్లాలోని గంగవరం మండలం కీలపట్ల కొత్తపల్లి గ్రామంలో గిరిజన బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. జూలై నెలలో ఆ గ్రామంలోని తొమ్మిదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన  27 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేయడం వరకే ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ప్రస్తుతం బాలిక  అచేతన స్థితికి చేరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కనీసం ఒక్క పైసా కూడా ప్రభుత్వము సహాయం అందించకపోవడం బాధాకరమని తెలిపారు. ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. బాలిక వైద్యాని ఒక రోజుకు లక్ష రూపాయలకు పైగా  ఖర్చు అవుతోందన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హితవు పలికారు. బాలిక చికిత్స కోసం సాయం చేయడానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం ఎక్కడైనా పొందాలేమో అని అమర్నాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2021-10-04T19:54:14+05:30 IST