అడుగడుగునా హక్కుల ఉల్లంఘన

ABN , First Publish Date - 2020-07-09T08:47:39+05:30 IST

రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

అడుగడుగునా  హక్కుల ఉల్లంఘన

  • అచ్చెన్న అరెస్టు తీరుపై హైకోర్టు అభ్యంతరం
  • ఎలా వ్యవహరించారో ఇట్టే తెలిసిపోతోంది
  • ఆయన శస్త్రచికిత్స గురించి తెలియదా?
  • దర్యాప్తు అధికారి మాటల్ని విశ్వసించలేం
  • ఏసీబీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన కోర్టు
  • ఆపరేషన్‌ జరిగిందని ఆయన చెబుతున్నా
  • 600 కిలోమీటర్లు ప్రయాణింపజేస్తారా?
  • రక్తస్రావంతో దారిపొడవునా ప్యాడ్లు 
  • మార్చుకున్నారని కౌంటర్‌లో ఉందిగా
  • ఘోర నేరం చేసిన నిందితులకైనా
  • రాజ్యాంగ రక్షణ తొలగించలేరు
  • దర్యాప్తు అధికారి ఇది అర్థం చేసుకోవాలి
  • అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలి
  • అచ్చెన్నను గుంటూరు రమేశ్‌ ఆస్పత్రికి పంపండి
  • వారానికి రెండుసార్లు హెల్త్‌ బులెటిన్‌ ఇవ్వాలి
  • పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ వేయండి
  • అవినీతి నిరోధక శాఖకు ధర్మాసనం ఆదేశం
  • రాత్రి 8 గంటలకు గుంటూరుకు తరలింపు
  • రమేశ్‌ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స


అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. శస్త్రచికిత్స జరిగిందని చెబుతున్నా ఆయనతో 600 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయిస్తారా?

ఆయనకు శస్త్రచికిత్స జరిగినట్లు తమకు తెలియదని దర్యాప్తు అధికారి చెప్పే మాటలను విశ్వసించలేం. అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చేటప్పుడు రక్తస్రావంతో దారి పొడవునా అచ్చెన్న ప్యాడ్లు మార్చుకున్నారని ఏసీబీయే తన కౌంటర్‌లో చెప్పిందిగా!

ఘోరమైన నేరం చేసిన నిందితుడికి సైతం రాజ్యాంగం కల్పించిన రక్షణను తొలగించలేరన్నది దర్యాప్తు అధికారి అర్థం చేసుకోవాలి. 

హైకోర్టు


అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇది చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. శస్త్రచికిత్స జరిగిందని చెబుతున్నా ఆయనతో 600 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ కారణంగా అచ్చెన్నాయుడు తీవ్రమైన మానసిక వ్యధకు గురవడంతో పాటు పలు అనారోగ్య ఇబ్బందులు, శస్త్రచికిత్సలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది. పిటిషనర్‌ కు శస్త్రచికిత్స జరిగినట్లు తమకు తెలియదని దర్యాప్తు అధికారి చెబుతున్నప్పటికీ ఆయన మాటల్ని విశ్వసించలేమంది.


అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చేటప్పుడు రక్తస్రావం జరుగుతుండడంతో దారి పొడవునా అచ్చెన్న ప్యాడ్లు మార్చుకున్నారని ఏసీబీ తన కౌంటర్‌లో చెప్పడా న్ని గుర్తుచేసింది. నేరం పాపంతో సమానమని, నిందితు డు పాపం చేసినవాడని, అతడికి ఏ ఇతర హక్కులూ ఉండవని భావించే స్థితి నుంచి సమాజం ముందుకెళ్లిందనే విషయాన్ని అవగతం చేసుకోవడంలో సదరు దర్యా ప్తు అధికారి విఫలమయ్యారని దుయ్యబట్టింది. ఘోరమై న నేరం చేసిన నిందితుడికి సైతం రాజ్యాంగం కల్పించి న రక్షణను తొలగించలేరన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాలని చీవాట్లు పెట్టింది. పిటిషనర్‌ భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పినప్పటి కీ.. చట్టపాలన, మానవహక్కులు, ధర్మాన్ని దాటేందుకు దర్యాప్తు సంస్థకు అధికారం లేదని తెగేసి చెప్పింది. అచ్చెన్నాయుడికి మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని రమే శ్‌ ఆస్పత్రికి పంపించాలని విజయవాడ జిల్లా జైలు సూ పరింటెండెంట్‌ను ఆదేశించింది. ఆయన ఆరోగ్యంపై వారానికి 2 సార్లు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని ఆస్పత్రిని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, అచ్చెన్నాయుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన్ను కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించాల్సిని అవసరం లేదని ఏసీబీ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌  పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పై విధంగా ఉత్తర్వులిచ్చారు.


 దుస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సింది..

‘ప్రపంచ మానవహక్కుల డిక్లరేషన్‌ ప్రకారం ఎవరినీ చిత్రహింసలకు గురిచేయకూడదు. మానవత్వం లేకుం డా క్రూరంగా వ్యవహరించలేరు. శస్త్రచికిత్స చేసిన వ్యక్తి తో సుదీర్ఘ ప్రయాణం చేయించడం వల్ల మరో సర్జరీ చేయాల్సి వచ్చింది. నొప్పి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. పిటిషనర్‌ సీఆర్‌పీసీ సెక్షన్‌ 54 కింద తనను ప్రైవేటు ఆస్పత్రికి పంపించాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఆయన దుస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సింది’ అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ‘అచ్చెన్నాయెడి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఆ ఉ త్తర్వులకు విరుద్ధంగా హెల్త్‌ బులెటిన్లను కోర్టు ముం దుంచకుండానే పిటిషనర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చే సి.. రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు బదులుగా విజయవా డ సబ్‌ జైలులో ఉంచారు’ అన్న పిటిషనర్‌ తరఫు న్యా యవాది వ్యాఖ్యలతో హైకోర్టు ఏకీభవించింది. ‘ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడి ఆరోగ్య బులెటిన్‌ను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదన్న దానికి కౌంటర్‌లో సమాధానం లేకపోయింది. రాజమండ్రి సెం ట్రల్‌ జైలుకు బదులుగా విజయవాడ సబ్‌జైలులో ఎందుకు ఉంచాల్సి వచ్చిందన్నదానికీ సమాధానం లేదు. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రతివాదులు పిటిషనర్‌ను విజయవాడ సబ్‌జైలుకు మార్చారు. గత నెల 23 తర్వాత అచ్చెన్నాయుడి ఆరోగ్య బులెటిన్‌ విడుదలపై కౌంటర్‌ అఫిడవిట్‌లో ప్రస్తావించనే లేదు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 


వారి ప్రవర్తన అర్థం కావడం లేదు..: ‘హెల్త్‌ బులెటిన్‌ పంపించాలని ప్రత్యేక కోర్టు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. కానీ సివిల్‌ సర్జన్‌ /ఆర్‌ఎంవో సంతకంతో గత నెల 22, 23 తేదీల్లో జారీ అయిన హెల్త్‌ బులెటిన్‌ను సదరు కోర్టు ముందుంచారు. మూడు, నాలుగు రోజుల్లో పిటిషనర్‌ను డిశ్చార్జ్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కానీ కౌంటర్‌ అఫిడవిట్‌తో పాటు ఇ చ్చిన హెల్త్‌ బులెటిన్‌లో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సం తకం ఉంది. ఆ వ్యక్తుల ప్రవర్తనను, అలా దాఖలు చేయడంలోని ప్రయోజనమేంటో కోర్టు అర్థం చేసుకోలేకపోతోంది’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. 3-4 రోజుల్లో డిశ్చార్జ్‌ చేసేందుకు అవకాశముందంటూ గత నెల 22, 23 తేదీల్లో ఇచ్చిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్న గుంటూ రు ప్రభుత్వాస్పత్రి.. 24న ఆయన్ను డిశ్చార్జ్‌ చేయవచ్చంటూ జిల్లా జైలు సూపరింటెండెంట్‌కు మరో లేఖ పంపించడంపై విస్మయం వ్యక్తం చేశారు. పిటిషనర్‌ పట్ల వారు ఎలా వ్యవహరించారో ఇదే స్పష్టం చేస్తోంద ని వ్యాఖ్యానించారు. ‘ఈ నెల 1న అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్‌ చేయడానికి ఒక్కరోజు ముందుగా కలనోస్కోపీ చేశారు.


తనకు మైకంగా ఉందని పిటిషనర్‌ అభ్యర్థించినా బయోప్సీ నివేదిక రాకముందే ఆస్పత్రి అధికారులు హ డావుడిగా డిశ్చార్జ్‌ చేశారు. జిల్లా జైలు వైద్యాధికారి ఈ నెల 4న సమర్పించిన నివేదిక మేరకు పిటిషనర్‌ తీవ్ర బాధతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే స్పష్టంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగందని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు’ అని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.

Updated Date - 2020-07-09T08:47:39+05:30 IST