అవాంఛనీయ కార్యకలాపాలు చేస్తున్నారంటూ JNUSU మాజీ అధినేతపై వేటు

ABN , First Publish Date - 2022-05-06T22:47:49+05:30 IST

యూనివర్సిటీలోని School of Social Sciences కు చెందిన మాజీ విద్యార్థి సుచేత దే అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఆమైపై Vice-Chancellor చర్యలు తీసుకున్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం..

అవాంఛనీయ కార్యకలాపాలు చేస్తున్నారంటూ JNUSU మాజీ అధినేతపై వేటు

న్యూఢిల్లీ: ప్రఖ్యాత జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధినేత Sucheta De పై ఆ యూనివర్సిటీ యాజమాన్యం వేటు వేసింది. Campus లో ఆమె అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆరోపణలతో ఆమెను క్యాంపస్ రావద్దంటూ బహిష్కరించారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని క్యాంపస్‌లో పని చేస్తున్న Mess సిబ్బంది, sanitation సిబ్బంది మూడు రోజులుగా నిరసన చేస్తున్నారు. అయితే వారిని నిరసనకు ప్రేరేపించింది సుచేతనేనన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.


ఈ విషయమై యూనివర్సిటీ చీఫ్ ప్రోక్టార్ రజ్నీష్ కుమార్ మిశ్రా స్పందిస్తూ.. ‘‘యూనివర్సిటీలోని School of Social Sciences కు చెందిన మాజీ విద్యార్థి సుచేత దే అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఆమైపై Vice-Chancellor చర్యలు తీసుకున్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. సచేతను యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బహిష్కరించారు. సేచేతకు ఎవరూ యూనివర్సిటీలోని వారు ఎవరూ షెల్టర్ ఇవ్వకూడదు. ఈ ఆదేశాలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోబడతాయి’’ అని అన్నారు.

Read more