Japanese మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు...

ABN , First Publish Date - 2022-07-08T14:38:52+05:30 IST

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం ఉదయం దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు....

Japanese మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు...

టోక్యో (జపాన్): జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం ఉదయం దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.దీంతో షింజో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ జపాన్‌లోని నారా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా షింజోపై కాల్పులు జరిపినట్లు జపాన్ అధికారులు చెప్పారు. నారాలోని ఒక వీధిలో ఎన్నికల ప్రచార ప్రసంగం చేస్తున్నప్పుడు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో షింజో అబేపై వెనుక నుంచి కాల్పులు జరిపారు.ఈ ఘటనలో షింజో అబే ఛాతీలో బుల్లెట్ తగిలిందని అధికారులు పేర్కొన్నారు. అబే కుప్పకూలిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి తరలించారు. అబే పరిస్థితి విషమంగా ఉందని, అతను కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ చెప్పారు. జపాన్ దేశంలో మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించే ముందు కార్డియో పల్మనరీ అరెస్ట్ అని చెబుతారని సమాచారం.



 అబే కుప్పకూలిన సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. సంఘటనా స్థలంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అబే ఎన్నికల ప్రచార ప్రసంగం చేస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి షాట్‌గన్‌తో దాడి చేసినట్లు జపాన్ అధికారులు చెప్పారు.  బూడిదరంగు టీ-షర్టు ధరించిన 41 ఏళ్ల అనుమానితుడిని ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అబేపై కాల్పులు జరిపిన చోట నుంచి పోలీసులు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన షింజో అబే 1993లో జపాన్ దిగువ సభకు ఎన్నికయ్యారు. అబే తొలిసారిగా 2006లో జపాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే వివాదాల కారణంగా ఒక సంవత్సరం పదవిలో ఉన్న తర్వాత పదవీవిరమణ చేశారు.


ఇతను 2012లో మళ్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత, జపాన్ ఆర్థికాభివృద్ధికి కృషి చేశారు.  అబే అబెనోమిక్స్ అని పిలిచే ఆర్థిక విధానాలను అమలు చేశారు.  2017అక్టోబరులో అబే పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచారు. జపాన్‌లో  అబే నాలుగో నాలుగోసారి ఎన్నికయ్యారు. తరువాతి రెండు సంవత్సరాల్లో అతని పరిపాలన కుంభకోణాలతో కుప్పకూలింది.


Updated Date - 2022-07-08T14:38:52+05:30 IST