Abn logo
Sep 21 2021 @ 01:17AM

ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ చీఫ్‌గా..మాజీ ఐఏఎస్‌ రాజీవ్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ విభాగాధిపతిగా మాజీ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ఇంతవరకు ఆ స్థానంలో పనిచేసిన అంఖీదాస్‌ హిందూత్వ నేతలు హింసను ప్రేరేపించేలా పోస్టులు పెట్టినా పట్టించుకోలేదని గత ఏడాది ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో రాజీవ్‌ అగర్వాల్‌ను నియమించినట్లు ఫేస్‌బుక్‌ సోమవారం ప్రకటించింది. యూపీ కేడర్‌కు చెందిన అగర్వాల్‌ 9 జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో అత్యంత కీలకమైన ప్రమోష న్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ శాఖ సంయుక్త కార్యదర్శిగా సేవలందించారు.