May 6 2021 @ 00:13AM

మామిడి తోటలో మాజీ హీరోయిన్‌

తెలుగులో ‘విక్కీ దాదా’, ‘కలియుగ కర్ణుడు’, ‘శాంతి-క్రాంతి’ చిత్రాల్లో కథానాయికగా నటించిన జుహీ చావ్లా గుర్తుంది కదూ. మెగాస్టార్‌ చిరంజీవి తొలి హిందీ చిత్రం ‘ప్రతిబంధ్‌’లో కూడా ఈమే కథానాయిక. హిందీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన జుహీ చావ్లా 1995లో వ్యాపారవేత్త జైమెహతాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక కూడా నటనకు దూరం కాలేదు. ఒకపక్క నటిస్తూనే, నిర్మాతగా మారి మూడు చిత్రాలు నిర్మించారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. ముంబైలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉండడంతో సెలబ్రిటీలు ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బతికుంటే బలుసాకు తినొచ్చని కొంతమంది విదేశాలకు కూడా వెళ్లిపోతున్నారు. కానీ జుహీ చావ్లా మాత్రం ఎక్కడికీ వెళ్లకుండా ముంబై వాడా రోడ్‌లో ఉన్న తన మామిడి తోటలోకి మకాం మార్చారు. అక్కడే ఆఫీసు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తాజాగా ట్విట్టర్‌ ద్వారా జుహీ తెలిపారు.