Haryana: అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా

ABN , First Publish Date - 2022-05-21T22:41:45+05:30 IST

అక్రమాస్తుల కేసు (Disproportionate Assets Case)లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్

Haryana: అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా

న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు (Disproportionate Assets Case)లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా (Om Prakash Chautala)ను ఢిల్లీలోని రోజ్ ఎవెన్యూ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నెల 26న వాదనల అనంతరం చౌతాలాకు శిక్ష విధించనుంది. 1993-2006 మధ్య చౌతాలా తన ఆదాయానికి మించి రూ. 6.09 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టుకున్నారని ఆరోపిస్తూ 26 మార్చి 2010న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.


ఇదే కేసుకు సంబంధించి జనవరి 2021లో చౌతాలాపై మనీలాండరింగ్ అభియోగాలు కూడా నమోదయ్యాయి. కాగా, 2013లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో దోషిగా తేలిన చౌతాలా, ఆయన కుమారుడు అజయ్‌కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 87 ఏళ్ల చౌతాలా గతేడాది జులైలో జైలు నుంచి విడుదలయ్యారు. 

Updated Date - 2022-05-21T22:41:45+05:30 IST