Abn logo
May 2 2021 @ 15:26PM

యానాంలో మాజీ సీఎం వెనుకంజ, ఆధిక్యంలో స్వతంత్ర అభ్యర్థి

పుదుచ్చేరి: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికల కౌంటింగ్ ఆదివారం కొనసాగుతోంది. కాగా, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి ఈ కౌంటింగ్‌లో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ అశోక్‌ 3,067 ఓట్లతో ఆధిక్యంలో ఉండడం గమనార్హం. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇప్పటికి 7 స్థానాల్లో పూర్తి ఫలితాలు వచ్చాయి. మరో 5 స్థానాల ఫలితాల్లో ఆధిక్యానికి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. మరో 18 స్థానాల ఫలితాలు ఇంకా ప్రారంభం కాలేదు. కాగా ఇప్పటికి పూర్తి ఫలితాలు వచ్చిన సీట్లలో ఆల్ ఇండియా ఎన్‌ఆర్ కాంగ్రెస్ 4 స్థానాలను గెలుచుకుని ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ రెండు స్థానాలను గెలుచుకుని ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. డీఎంకే ఒక స్థానం గెలుచుకోగా కాంగ్రెస్ రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.

Advertisement
Advertisement