అమ్మవారిని దర్శించుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి
బాసర, జూలై, 4 : బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి సోమవారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని వేద పండితుల మంత్రోశ్చరణాల మధ్య ఆమె ప్రత్యేకపూజలు నిర్వహించారు. అంతకుముందు గోదావరి తీరంలోని శివాల యాన్ని సందర్శించారు. బాసర చరిత్ర గురించి పండితులను అడిగి తెలు సుకున్నారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి పండితులు ఆశీర్వదించారు.