గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్‌ రామాగౌడ్‌ మృతి

ABN , First Publish Date - 2022-01-29T04:50:01+05:30 IST

పెద్దశంకరంపేటకు చెందిన ఉమ్మడి ఏపీ గీత పారిశ్రామిక సహకార సంస్థ మాజీ చైర్మన్‌, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ నాయకుడు విగ్రాం రామాగౌడ్‌(80) శుక్రవారం మృతిచెందారు.

గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్‌ రామాగౌడ్‌ మృతి

 పెద్దశంకరంపేట, జనవరి 28: పెద్దశంకరంపేటకు చెందిన ఉమ్మడి ఏపీ గీత పారిశ్రామిక సహకార సంస్థ మాజీ చైర్మన్‌, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ నాయకుడు విగ్రాం రామాగౌడ్‌(80) శుక్రవారం మృతిచెందారు. రామాగౌడ్‌ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. పెద్దశంకరంపేటకు చెందిన విగ్రాం రామాగౌడ్‌ 1960-70లో వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి ఉపసర్పంచుగా ఎన్నికయ్యారు. 1982-86 వరకు పేట సర్పంచుగా, జోగిపేట పంచాయతీ సమితి  ఉపాధ్యక్షుడిగా పని చేశారు. 1987-92లో పెద్దశంకరంపేట మండల పరిషత్‌కు మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1995లో కల్హేర్‌ జడ్పీటీసీగా గెలుపొందారు. 2002లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంస్థ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2014లో టీఆర్‌ఎ్‌సలో చేరారు. దివంగత మంత్రి కరణం రామచందర్‌రావుకు ప్రధాన అనుచరుడిగా ఉంటూ పెద్దశంకరంపేట మండల అభివృద్ధికి కృషి చేశారు. రామాగౌడ్‌కు ఇద్దఉ కుమారులు, కూతురు ఉన్నారు. రామాగౌడ్‌సతీమణి లలితమ్మ ఎంపీపీగా, జడ్పీటీసీగా పని చేశారు. ఆయన పెద్ద కుమారుడు శ్రీనివా్‌సగౌడ్‌  రెండుసార్లు ఎంపీపీగా పని చేశారు. ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ కేంద్ర డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.


అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు


రామాగౌడ్‌ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం పెద్దశంకరంపేటలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. పెద్దశంకరంపేటలో స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు మూసి వేశారు. పెద్దశంకరంపేటతో పాటు నారాయణఖేడ్‌, రేగోడు, అల్లాదుర్గం, టేక్మాల్‌, జోగిపేట, పాపన్నపేట మండలాల నుంచి ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ సురే్‌షషెట్కార్‌, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, పీసీసీ సభ్యులు సంజీవరెడ్డి, మెదక్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బట్టి జగపతి, మెదక్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, పేట ఎంపీపీ జంగం శ్రీనివాస్‌, సర్పంచ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-01-29T04:50:01+05:30 IST