Advertisement
Advertisement
Abn logo
Advertisement

అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావు: Renuka

హైదరాబాద్: అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావని  మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సభలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదని తెలిపారు. అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారిపై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతకాదని మండిపడ్డారు. అధికారం, సభలో మంద బలం ఎప్పుడూ శాశ్వతం కాదని.... కేవలం మన హుందాతనం, ప్రవర్తన మాత్రమే  శాశ్వతమని చెప్పుకొచ్చారు.


ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరమన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు బాధ్యత మరచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదని తెలిపారు. అధికార, ప్రతిపక్షాలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.  మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సభ్యులు పనిచేయాలని రేణుకా చౌదరి హితవుపలికారు. 

Advertisement
Advertisement