కోలుకుంటున్న కపిల్‌

ABN , First Publish Date - 2020-10-25T09:02:07+05:30 IST

గుండెపోటుకుగురై ఇక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కోలుకుంటున్నాడు. గురువారం అర్ధరాత్రి

కోలుకుంటున్న కపిల్‌

న్యూఢిల్లీ: గుండెపోటుకుగురై ఇక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కోలుకుంటున్నాడు. గురువారం అర్ధరాత్రి గుండెనొప్పి రావడంతో ఇక్కడి ఫోర్టి్‌స-ఎస్కార్ట్స్‌ ఆసుపత్రిలో చేరిన కపిల్‌కు యాంజియోప్లాస్టీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కపిల్‌దేవ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను కోలుకుంటున్నట్టు మాజీ పేసర్‌ చేతన్‌ శర్మ వెల్లడించాడు. ఆసుపత్రి బెడ్‌పై నవ్వుతూ డబుల్‌ థమ్సప్‌ చూపుతున్న కపిల్‌ దేవ్‌ ఫొటోను చేతన్‌ శర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో కపిల్‌ పక్కన కూతురు అమియా కూడా ఉంది. కపిల్‌ పాజీ చక్కగా కోలుకుంటున్నాడని శర్మ ట్వీట్‌ చేశాడు.

Updated Date - 2020-10-25T09:02:07+05:30 IST