టెక్నాలజీ సాయంతో వ్యాయామం చేస్తున్న మైక్ టైసన్

ABN , First Publish Date - 2020-08-07T01:49:58+05:30 IST

పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తరువాత బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి దిగనున్నాడు. సెప్టెంబరు 12న జరగనున్న ...

టెక్నాలజీ సాయంతో వ్యాయామం చేస్తున్న మైక్ టైసన్

వాషింగ్టన్: పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తరువాత బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ మళ్లీ రింగ్‌లోకి దిగనున్నాడు.  సెప్టెంబరు 12న జరగనున్న ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో టైసన్ పాల్గొన్ననున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మాజీ బాక్సర్ రాయ్ జోన్స్ జూనియర్‌తో టైసన్ తలపడనున్నాడు. ఈ బౌట్ కోసం అతడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే 54 ఏళ్ల వయసులో వ్యాయామం చేస్తుండడంతో శరీరం సహకరించడం లేదని, అందువల్ల ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్‌ పరికరం సాయంతో కండరాల వ్యాయామం చేస్తున్నానని టైసన్ వివరించాడు. ‘ఇన్నేళ్ల తరువాత బాక్సింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టబోతున్నాను. దానికోసం మొదట వ్యాయామం ప్రారంభించాను. అయితే కీళ్లు సహకరించడం లేదు. ఇందుకే బాక్సింగ్‌కు దూరమయ్యానని అప్పుడనిపించింది. దాంతో కొత్తగా ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ పరికరంతో శరీర దారుఢ్యం పెంచుకుంటున్నాన’ని టైసన్ వెల్లడించాడు.

Updated Date - 2020-08-07T01:49:58+05:30 IST