Abn logo
Sep 27 2020 @ 16:21PM

రైతుల ఆందోళనలో పాల్గొన్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్‌ హిమాన్షికి కరోనా

Kaakateeya

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలో పాల్గొన్న బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటి, మోడల్ హిమాన్షి ఖురానా కొవిడ్ బారినపడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడించింది. రైతుల ఆందోళనలో పాల్గొన్న తాను తిరిగి షూటింగ్‌కు వెళ్లడానికి ముందు ముందుజాగ్రత్త చర్యగా కరోనా పరీక్ష చేయించుకున్నానని, అందులో తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపింది.


ఇటీవల తనను కలిసిన అందరూ దయచేసి కరోనా పరీక్ష చేయించుకోవాలని హిమాన్షి కోరింది. ఆందోళనలో పాల్గొన్న అందరూ పరీక్షలు చేయించుకోవాలని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విషయం తెలిసిన ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.  


వ్యవసాయ బిల్లలకు వ్యతిరేకంగా ఈ నెల 25న దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో హిమాన్షి పాల్గొంది. ఆందోళనల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేసింది. మనమంతా రైతులకు మద్దతుగా నిలవాలని పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement