ఆ విజయం కోసం ప్రాణం పెట్టాం

ABN , First Publish Date - 2020-07-14T09:00:32+05:30 IST

పద్దెనిమిదేళ్ల (20 02లో) క్రితం జరిగిన నాట్‌వెస్ట్‌ ట్రోఫీని భారత క్రికెట్‌ అభిమా నులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ ట్రోఫీని దక్కించుకోవడంలో ...

ఆ విజయం కోసం ప్రాణం పెట్టాం

నాట్‌వెస్ట్‌ ఫైనల్‌పై యువీ

న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల (20 02లో) క్రితం జరిగిన నాట్‌వెస్ట్‌ ట్రోఫీని భారత క్రికెట్‌ అభిమా నులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ ట్రోఫీని దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ నాటి మధుర స్మృతులను తలచుకుంటూ సోమవారం ట్వీట్‌ చేశాడు. ‘నాట్‌వెస్ట్‌ ట్రోఫీ కోసం ప్రాణం పెట్టి ఆడాం. మేమప్పటికి యువ ఆటగాళ్లం. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సమష్టి కృషితో గెలవగలిగాం’ అని యువీ గుర్తు చేసుకున్నాడు.  ఫైనల్లో 326 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు ఓ దశలో 146/5 స్కోరుతో విజయం ఇక అసాధ్యం.. అనే స్థితిలోకి వెళ్లింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువరాజ్‌-మహ్మద్‌ కైఫ్‌ జోడీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మరో మూడు బంతులుండగానే జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించారు. ఆ గెలుపు ఉద్వేగాన్ని తట్టుకోలేని కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ లార్డ్స్‌ బాల్కనీలో చొక్కా విప్పి ఊగిపోయాడు. ఆ ఫైనల్లో యువీ 69 రన్స్‌ చేశాడు.

Updated Date - 2020-07-14T09:00:32+05:30 IST