ఎఫ్‌ఎ–1 పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు

ABN , First Publish Date - 2021-10-18T04:50:07+05:30 IST

పాఠశాల విద్యార్థులకు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఎ–1) పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది.

ఎఫ్‌ఎ–1 పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు

ఏలూరుఎడ్యుకేషన్‌, అక్టోబరు 17: పాఠశాల విద్యార్థులకు ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఎ–1) పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. ముద్రించిన ప్రశ్నాపత్రాలను కాకుండా, పరీక్ష ప్రారం భానికి గంట ముందు హెచ్‌ఎంల ఫోన్‌లకు సాఫ్ట్‌కాపీ రూపంలో పంపే ప్రశ్నా పత్రాన్నే వినియోగించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క సబ్జెక్టు లో కనీసం 40 ప్రశ్నలు ఉంటాయి. వీటిని ఫోన్లలో హెచ్‌ఎంలు, టీచర్లు చూసుకుని తరగతి గదిలో బ్లాక్‌ బోర్డుపై రాసి పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. కొవిడ్‌ నిబంధనల మేరకు తరగతులు రోజువిడిచి రోజు జరుగుతున్నాయి. దసరా సెలవులు అనంతరం సోమవారం నుంచి విద్యార్థులం దరూ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుందని ప్రధానోపాధ్యా యులు చెబుతున్నారు. ఒక్కొ తరగతి గదికి 40 నుంచి 50 మంది విద్యార్థులను  కూర్చోబెట్టి పరీక్ష రాయించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. కొవిడ్‌ భయాం దోళన నేపథ్యంలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను ముద్రిత ప్రశ్నా పత్రాలతో పరీ క్ష రాయించడం సబబు అని, అధికారులు పునఃపరిశీలన చేయాలని కోరుతున్నారు.


21 నుంచి పరీక్షలు


జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగ తి విద్యార్థులకు ఈనెల 21 నుంచి 25 వరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఎ–1) పరీక్షలు నిర్వహించాలని డీఈవో సీవీ.రేణుక ఆదేశించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పరీక్షలు ఉదయం 10 నుంచి 11 గంటల వరు జరుగుతాయి. 21న తెలుగు, 22న ఇంగ్లీషు, 23న గణితం, 25న ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల కు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 21న ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 22న హిందీ, ఫిజికల్‌ సైన్స్‌, 23న ఇంగ్లీషు, సోషల్‌ స్టడీస్‌, 25న సంస్కృతం, జీవశాస్త్రం పరీక్షలు జరుగుతాయి. ప్రశ్నాపత్రాలను ఎస్‌సిఇఆర్‌టి రూపొందించి ఆయా తేదీల్లో ఉదయం డీఈవో వాట్సాప్‌ గ్రూపు ద్వారా ఎంఈవోల గ్రూపునకు, వారి నుంచి పాఠశాలల హెచ్‌ఎంలకు ఒక గంట ముందు సాఫ్ట్‌ కాపీల రూపంలో తెలియజేస్తామన్నారు. తరగతి గదిలోని బ్లాక్‌/గ్రీన్‌ బోర్డుపై ప్రశ్నాపత్రాలను రాసి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు జరపాలన్నారు. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఎఫ్‌ఎ–1 పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యాధికారులు పాఠశాలల్లో తనిఖీలు చేయాలని డీఈవో సూచించారు.

Updated Date - 2021-10-18T04:50:07+05:30 IST