ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో ముందడుగు

ABN , First Publish Date - 2020-08-07T23:22:37+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో ముందడుగు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. రాష్ట్రంలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల ఏపీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాల పునర్వవస్థీకరణ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల ఏర్పాటుకు ఈ కమిటీ పనిచేయనుంది. సభ్యులుగా సీసీఎల్‌ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారిని నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఉండనున్నారు. మూడు నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. ఈమేరకు గడువు విధిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-07T23:22:37+05:30 IST