రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-03-07T07:13:13+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యా ద్రి డిమాండ్‌ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
రైతు సంఘం జెండాను ఆవిష్కరిస్తున్న మాదాల రమణయ్య

పామూరు, మార్చి 6: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కొమ్మలపాటి మాల్యా ద్రి డిమాండ్‌ చేశారు. నల్లచట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతు లు చేస్తున్న ఉద్యమం నేటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా గోపాలపురం గ్రామంలో ‘రైతు గెలవాలి- వ్యవసాయం నిలివాలి’ అని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం జెండాను ఆవిష్కరించారు.  నల్లచట్టాల రద్దు కోసం ఎముకలు కొరికే చలిలో ఢిలీల్లో లాఠీలు, తూటాలు తగిలి 280 మంది ప్రాణాలు వదిలారన్నారు. రైతులపై అక్రమ కేసులు బనాయిస్తున్నా వెనకడుగువేయకుండా ఉద్యమం నిర్వహిస్తున్నారన్నారు. రైతాంగానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోందన్నారు. కార్పొరేట్లకు దేశసంపదను దోచి పెడుతున్న బీజేపీ పాలనకు అంతం పలకాలని యావత్తు ప్రజానీకం రైతుల పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు. కార్యక్రమంలో అంకయ్య, గురవయ్య, చెంచమ్మ, లక్ష్మి, కొండమ్మ, వరమ్మతో పాటు వ్యవసాయ, ఉపాధి  కార్మికులు పాల్గొన్నారు.

పోలినేనిపాలెం (వలేటివారిపాలెం) : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీలో చేస్తున్న ఉద్యమం వంద రోజులు పూర్తయిన సందర్భంగా రైతు సంఘం పోరాట సమితి జెండాను రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి మాదాల రమణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రమణయ్య మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వ నిర్భందం తో 248 మంది రైతులు అమరులయ్యారన్నారు. అయినా నేటికి దీక్షతో రైతాంగం చేస్తున్న ఉద్యమం స్పూరిదాయకమన్నారు. కార్యక్రమంలో రైతులు మానికొండ రమణయ్య, మాదాల మాదవరావు, అనుమోల వెంకటేశ్వర్లు, పొన్నగంటి బాలనరసింహం, చింతలపూడి మాదవరావు తదితరులు పాల్గొన్నారు.

సీ.ఎ్‌స.పురం : వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో జరుగు తున్న రైతాంగం ఉద్యమకారులకు సంఘీభావం తెలుపుతూ.. రైతుసంఘం నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని సీఎస్‌.పురం అరివేముల, ఉప్పలపాడు, రేగులచెలక గ్రామాలలో శనివారం రైతు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతుసంఘం నాయకులు కర్నా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎన్నో కష్టాలకోర్చి 100 రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. కార్యక్రమంలో ఊసా వెంకటేశ్వర్లు, ఎస్‌.తిరుపతిరెడ్డి, ఎస్‌.కిషోర్‌, నారాయణ, రత్నం, తులసీరావు, నర్సారెడ్డి, ఆంథోని, థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T07:13:13+05:30 IST