అడవులు అభివృద్ది చెందుతున్నాయి

ABN , First Publish Date - 2021-07-25T06:02:36+05:30 IST

ఖానాపూర్‌ మండలంలోని తర్లపాడ్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఎఫ్‌డివో కోటేశ్వరరావ్‌ ఆద్వర్యంలో మొక్కలు నాటారు.

అడవులు అభివృద్ది చెందుతున్నాయి
ఖానాపూర్‌ మండలంలోని తర్లపాడ్‌ వద్ద మొక్కలు నాటుతున్న అటవీ అధికారులు

ఎఫ్‌డివో కోటేశ్వరరావ్‌

ఖానాపూర్‌ రూరల్‌ , జూలై 24 : ఖానాపూర్‌ మండలంలోని తర్లపాడ్‌ అటవీ ప్రాంతంలో శనివారం ఎఫ్‌డివో కోటేశ్వరరావ్‌ ఆద్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మట్లాడుతూ, హరాతహారం కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుండి అడవులు అభివృద్ది చెందుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు నాటిన మొక్క సంరక్షణకు తమ వంతు భాద్యతగా కృషి చేయాలని సూచించారు.  ఖానాపూర్‌ డివిజన్‌ పరిధిలో లక్ష యాబైవేల మొక్కలు నాటుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో వినాయక్‌, డిప్టిఆర్‌వో రత్నాకర్‌రావ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T06:02:36+05:30 IST