రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్‌ వాచర్‌ మృతి

ABN , First Publish Date - 2022-05-23T03:17:22+05:30 IST

ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనగా, ఫారెస్ట్‌ వాచర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలో

రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్‌ వాచర్‌ మృతి
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వెంకట్రావు


గుడ్లూరు, మే 22 : ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనగా, ఫారెస్ట్‌ వాచర్‌ మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు, మోచర్ల బీసీ కాలనీకి చెందిన చెట్టపల్లి వెంకట్రావు(55) ఫారెస్ట్‌ వాచర్‌గా పనిచేస్తున్నాడు.  ఆదివారం ఉదయం గ్రామానికి సమీపాన ఉన్న తన పొలానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు.  ఆ  సమయంలో చీరాల నుంచి పెంచలకోనకు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి  ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, కావలి ఏరియా ఆసు పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై మల్లిఖార్జున తెలిపారు.


Updated Date - 2022-05-23T03:17:22+05:30 IST