పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది రోడ్లకు అటవీ అనుమతులపై సమావేశం

ABN , First Publish Date - 2020-10-22T01:09:25+05:30 IST

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించి ఆదిలాబాద్ కాగజ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది రోడ్లకు అటవీ అనుమతులపై సమావేశం

హైదరాబాద్: పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు సంబంధించి ఆదిలాబాద్  కాగజ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 48 రోడ్లకు సంబంధించిన అటవీ అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయి. అటవీశాఖ అధికారులుతెలిపారు. వీటిని సత్వర పూర్తి చేసేందుకు  అటవీ, పంచాయితీ రాజ్ శాఖల ఉన్నతాధికారుల సమన్యయ సమావేశం బుధవారం జరిగింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ, పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది  శాఖ  కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పీసీసీఎఫ్ ఆర్. ఎం. దోబ్రియల్, రెండు శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


ఆయా జిల్లాల్లోని రోడ్ల అనుమతులు ఏ కారణంగా జాప్యం అవుతున్నాయన్న దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. అనుమతుల ప్రక్రియకు సంబంధించి ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేస్తే, అటవీ శాఖ తరపున పనులు వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా పీసీసీఎఫ్ శోభ హామీ ఇచ్చారు. జాప్యాన్ని నివారించేందుకు అన్ లైన్ ప్రక్రియ అమలు చేసే విధానాన్ని, అందుకోసం అయ్యే సమయాన్ని స్వయంగా అటవీ అధికారులు, పంచాయితీ రాజ్ అధికారులకు ఆమె వివరించారు.

Updated Date - 2020-10-22T01:09:25+05:30 IST