మంచిర్యాల: అకారణంగా రైతులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ సంఘటన జిల్లాలోని దండేపల్లి మండలంలో జరిగింది. మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఇద్దరు రైతులపై అటవీశాఖ అధికారులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. గాయపడిన రైతుల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం రైతులను ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో తరచుగా రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.