అటవీ అధికారుల అదుపులో ఇద్దరు వేటగాళ్లు

ABN , First Publish Date - 2021-04-12T05:30:00+05:30 IST

మహానంది మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడే ఇద్దరు వేటగాళ్లను సోమవారం రాత్రి అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అటవీ అధికారుల అదుపులో ఇద్దరు వేటగాళ్లు

మహానంది, ఏప్రిల్‌ 12: మహానంది మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడే ఇద్దరు వేటగాళ్లను సోమవారం రాత్రి అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నల్లమలలో తరచూ వన్యప్రాణులను హతమార్చుతున్నారన్న సమాచారం మేరకు అటవీ సిబ్బంది మహానంది, బుక్కాపురం గ్రామాలకు చెందిన ఇద్దరు వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం వేటగాళ్ల గురించి పూర్తి సమాచారం ఇస్తామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-04-12T05:30:00+05:30 IST