మల్లన్నవనం..

ABN , First Publish Date - 2022-05-02T05:59:22+05:30 IST

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మల్లన్నసాగర్‌ బ్యాక్‌వాటర్‌ను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని మల్లన్నవనంగా అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాకేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాంతంలో 4,794.47 హెక్టర్లలో అడవి విస్తరించి ఉండగా, మల్లన్నసాగర్‌లో 1,327.45 హెక్టర్ల అడవి ముంపునకు గురైంది. మిగిలిన 3,467.02 హెక్టార్లను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. లకుడారం స్టేజీ నుంచి అటవీ ప్రాంతం గుండా మల్లన్నసాగర్‌కు చేరుకోవడానికి రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మల్లన్నసాగర్‌ బ్యాక్‌వాటర్‌ను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని మల్లన్నవనంగా అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాకేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు.

మల్లన్నవనం..
మల్లన్నసాగర్‌ పక్కనే విస్తరించిన అటవీ ప్రాంతం

మల్లన్నసాగర్‌ పక్కనే అటవీ అభివృద్ధి

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయం

చురుగ్గా సాగుతున్న పనులు

వణ్యప్రాణుల సంరక్షణకు పకడ్బంది చర్యలు

రాజీవ్‌ రహదారి నుంచి రిజర్వాయర్‌ వరకు రోడ్డు నిర్మాణం


కొండపాక, మే 1 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మల్లన్నసాగర్‌ బ్యాక్‌వాటర్‌ను ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాన్ని మల్లన్నవనంగా అభివృద్ధి చేస్తున్నారు. జిల్లాకేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న అటవీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాంతంలో 4,794.47 హెక్టర్లలో అడవి విస్తరించి ఉండగా, మల్లన్నసాగర్‌లో 1,327.45 హెక్టర్ల అడవి ముంపునకు గురైంది. మిగిలిన 3,467.02 హెక్టార్లను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నారు. లకుడారం స్టేజీ నుంచి అటవీ ప్రాంతం గుండా మల్లన్నసాగర్‌కు చేరుకోవడానికి రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. 


3,467 హెక్టార్లలో అడవి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ను ఇటీవలే సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టును ఆనుకొని ఉన్న 3467 హెక్టార్ల అడవిని మల్లన్న వనంగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెద్దసంఖ్యలో వస్తుండడంతో పక్కనే ఉన్న అడవిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి రూ. 9 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అభయారణ్యం తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ అడవిలో పందులు, కొండ గొర్రెలు, నెమళ్లు, జింకలు, కుందేళ్లు పెద్ద సంఖ్యలో జీవనం సాగిస్తున్నాయి. వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో వాటి దప్పిక తీర్చడం కోసం అటవీ ప్రాంతంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. గుట్టల నుంచి కిందికి పారే వర్షపు నీటికి భూమి కోతకు గురికాకుండా ఉండడం కోసం లోతట్టు ప్రాంతాల్లో చెక్‌డ్యాంలను నిర్మించారు. అటవీ భూములు కబ్జాకు గురవకుండా హద్దులను గుర్తించేలా చుట్టూ కందకాలను తవ్విస్తున్నారు.


అడవి మధ్యలో సరస్సు

దట్టమైన అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యన ఉన్న అంకారెడ్డి చెరువు ప్రకృతి అందాలకు నెలవుగా నిలుస్తుంది. 65 అడుగుల లోతు, అర కిలోమీటరు పొడవున్న ఈ చెరువులో 1.5 టీఎంసిల నీరు నిల్వ ఉంటుందని అధికారులు అంచనా. వేసవిలో సైతం ఈ చెరువులో ఉంటుంది. అంతేకాకుండా అటవీ ప్రాంతంలో మొత్తం 65 కుంటలను గుర్తించారు. ఎక్కడి నీళ్లు అక్కడే నిలిచేలా కుంటలను పునరుద్ధరించారు. వేసవిలో అడవి జంతువుల దప్పిక తీర్చడానికి ఇవి ఉపయోగపడతాయి. అడవిలో పదిహేను చెక్‌డ్యాములు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో ఊటలు పెరిగి గుట్టల్లో నీళ్లు జాలువారుతున్నాయి. 


అటవీ అందాల వీక్షణకు వాచ్‌టవర్లు

అడవిలో ఎత్తైన ప్రాంతంలో వాచ్‌టవర్‌లు నిర్మించాలని నిర్ణయించారు. పర్యాటకులు అడవి అందాలను వీక్షించడానికి, అడవిపై నిఘా ఉంచడానికి ఇవి ఉపయోగపడతాయి. వాచ్‌టవర్ల పైనుంచి పర్యాటకులు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను కూడా చూడవచ్చు. రాజీవ్‌ రహదారిపై లకుడారం వద్ద ఎంట్రెన్స్‌ ప్లాజాను ఆకట్టుకునే డిజైన్‌తో తీర్చిదిద్దనున్నారు. టికెట్‌ కౌంటర్‌, సెక్యూరిటీ గది, రెస్ట్‌రూమ్‌ తదితర గదుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో ఔషధ మొక్కలను నాటుతున్నారు. 

Updated Date - 2022-05-02T05:59:22+05:30 IST