రకరకాల చెట్లు.. పొదలతో అటవీప్రాంతం. ఒకచోట జింక.. మరోపక్క గాండ్రించే పులి. ఇలా.. తిరుమల శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో సెట్టింగు వేశారు. ‘కనుమ’ సందర్భంగా స్వామివారు జంతువులను వేటాడే పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో తిరుమలకు సమీపంలోని పార్వేట మండపంలో కాకుండా.. గతేడాదిలాగే ఆలయంలోనే ఏకాంతంగా ఈ ఉత్సవం నిర్వహించారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి