నలుగురు ఆదివాసీ మహిళలపై అటవీశాఖ గార్డు దాడి?

ABN , First Publish Date - 2022-01-22T05:31:37+05:30 IST

పొయ్యిలోకి కట్టెలను సేకరించేందుకు వెళ్లిన నలుగురు ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ గార్డు దాడి చేసిన సంఘటన ములకలపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ఆ బాధితులు విలేకరులకు తెలిపారు. ములకలప

నలుగురు ఆదివాసీ మహిళలపై అటవీశాఖ గార్డు దాడి?

భయంతో తప్పించుకోబోయి కిందపడి గాయపడిన ఓ మహిళ 

ములకలపల్లి మండలంలో ఘటన

కట్టెలకోసం వెళితే దాడిచేశాడని బాధితుల ఆరోపణ

ములకలపల్లి, జనవరి 21 : పొయ్యిలోకి కట్టెలను సేకరించేందుకు వెళ్లిన నలుగురు ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ గార్డు దాడి చేసిన సంఘటన ములకలపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను శుక్రవారం ఆ బాధితులు విలేకరులకు తెలిపారు. ములకలపల్లి మండలంలోని అత్యంత మారుమూల గ్రామమైన సాకివాగు వలస ఆదివాసీ గ్రామానికి చెందిన నలుగురు ఆదివాసీ మహిళలు పొయ్యిలోకి కట్టెలు సేకరించేందుకు గురువారం గ్రామ సమీపంలోని అడవికి వెళ్లారు. వారు కట్టెలు సేకరించే పనిలో నిమగ్నమవగా.. అటుగా వచ్చిన అటవీశాఖ గార్డు మహేష్‌ తొలుత తనకు సమీపంలో ఉన్న సోడి మాడమ్మను వెంటపడి తరిమాడు. ఈలోపు భయపడిన మాడమ్మ అనే మహిళ గార్డు నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తుతూ పెద్ద గోతిలో పడి తీవ్ర గాయాలపాలైంది. మరి కొద్ది దూరంలో ఉన్న లక్ష్మి, రజనీలపైనా దూర్బాషలాడుతూ చేయి చేసుకున్నాడని వారు వివరించారు. అయితే మరో యువతి దేవమ్మ మాట్లాడుతూ గార్డు తనను విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు దుస్తులు కూడా ఊడదీశాడని కన్నీటి పర్యంతమైంది. ఈ విషయంపై ములకలపల్లి రేంజర్‌ రవికిరణ్‌ను వివరణ కోరగా ఇలాంటి సంఘటన ఏమీ జరగలేదని వివరణిచ్చారు. 

అటవీశాఖ గార్డుపై చర్యలు తీసుకోవాలి : ఎన్డీ నాయకుడు కృష్ణ

సాకివాగు వలస ఆదివాసీలపై దాడి చేసిన అటవీశాఖ గార్డు మహేష్‌పై చర్యలు తీసుకోవాలని న్యూడెమోక్రసీ  పాల్వంచ డివిజన నాయకుడు కుంజా కృష్ణ డిమాండ్‌ చేశారు. పొయ్యిలో కట్టెలు సేకరించే వారిపట్ల విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని ఖండించిన ఆయన దీనిపై అధికారులు స్పందించాలని కోరారు. 

Updated Date - 2022-01-22T05:31:37+05:30 IST