ఫ్యూచర్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

ABN , First Publish Date - 2022-08-05T06:03:01+05:30 IST

ఫ్యూచర్‌ రిటైల్‌ లెక్కల ఖాతాలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ జల్లెడ పడుతోంది. ఆర్థిక విషయాలకు

ఫ్యూచర్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌ లెక్కల ఖాతాలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ జల్లెడ పడుతోంది. ఆర్థిక విషయాలకు సంబంధించి కంపెనీ ఏమైనా అక్రమాలకు పాల్పడిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించింది. ఇందుకోసం మెస్సర్స్‌ చోక్సీ అండ్‌ చోక్సీ ఆడిట్‌ సంస్థను నియమించింది. ఆర్థిక వివరాలు, లావాదావీల వెల్లడిలే ఫ్యూచర్‌ రిటైల్‌ నిబంధనలు తుంగలో తొక్కిందనే సముచిత అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ తెలిపింది. 

Updated Date - 2022-08-05T06:03:01+05:30 IST