వి‘దేశీ’ యుద్ధం !

ABN , First Publish Date - 2020-03-28T10:24:42+05:30 IST

రోనా వ్యాప్తి చెందకుండా వారంతా వీర సైనికులుగా పనిచేశారు. ఎప్పటికప్పుడు ఊరూ వాడా తిరిగారు. ప్రతీ ఇంటికి తలుపు...

వి‘దేశీ’ యుద్ధం !

  • ఇరవై ఐదు వేల మందితో మహా సైన్యం
  •  కరోనా కట్టడికి ఆరోగ్య బృందాలదే కీలక పాత్ర 8 విదేశాల నుంచి వచ్చిన వారి వివరాల సేకరణ  8 ఇంటింటా ఆరా.. 4,146 మంది గుర్తింపు 

ఏలూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా వ్యాప్తి చెందకుండా వారంతా వీర సైనికులుగా పనిచేశారు. ఎప్పటికప్పుడు ఊరూ వాడా తిరిగారు. ప్రతీ ఇంటికి తలుపు తట్టారు. ఇంటిలో ఎంత మంది ఉన్నారు..? ఎవరెవరెరు ఉన్నారు ? విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా ? అనే వివరాలు సేకరించారు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ.. వారికి తగిన ఆరోగ్య జాగ్రత్తలు సూచించారు. ఇలా కొవిడ్‌ నియంత్రణకు పెద్దఎత్తున రంగంలోకి దిగిన వీరంతా ఇప్పటి వరకు చెమటోడ్చారు. ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తూనే ఉన్నారు. మరోసారి ఆరోగ్య సర్వేకు సిద్ధమవుతు న్నారు. వార్డు వలంటీర్‌, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, హెల్త్‌ అసిస్టెంట్‌, హెల్త్‌ సూపర్‌ వైజరు, ఆశా కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరూ ప్రజల ప్రాణాలను కంటికి రెప్పలా కాపా డుకున్నారు. మన జిల్లా నుంచి గల్ఫ్‌ దేశాలతోపాటు ప్రపంచం నలుమూలలకు లక్షలాది మంది ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. మరెంతో మంది ఉన్నత విద్యాభ్యాసానికి దేశ సరిహద్దులు దాటుతుంటారు. ఇలా నిత్యం వందలాది మంది వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ విదేశాల నుంచి వచ్చిన వారితో వ్యాప్తి చెందుతోందనే వార్తలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రంగం లోకి దిగాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను రాబట్టాలని నిర్ణయిం చాయి. ఇందుకు తగిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపింది. వారు ప్రతీ ఇంటికి వెళ్లి వారి వివరాలు, ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. అవసరమైన వారిని గుర్తించి వైద్యానికి సిఫార్సు చేశారు. కరోనా లక్షణాలతో అనుమానం ఉన్న వారిని దగ్గరలోని ఆసుపత్రుల్లో చేర్చారు. మరికొందరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తూ వచ్చారు. 


జిల్లావ్యాప్తంగా ఉన్న 12 లక్షల 43 వేల 246 నివాస గృహాలకుగాను 11 లక్షల 74వేల 234 తనిఖీ చేశారు. ఆయా కుటుంబాల్లో ఎవరైనా విదేశాలకు వెళ్లి స్వస్థలాలకు చేరుకున్నారా? లేదా? అనేది పరిశీలించారు. విదేశాల నుంచి స్వస్థలాలకు వస్తే ఎయిర్‌ పోర్టు నుంచి సంబంధిత వివరాలన్నీ ఆయా పీహెచ్‌సీలకు సమాచారం చేరవేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారం సంఖ్య నాలుగు వేలకుపైగా ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ఒకరు విదేశాల నుంచి స్వస్థలాలకు చేరితే ఆరా పూర్తిస్థాయిలో పోలీసు విచారణ మాదిరి గానే ఉంటుంది. సదరు వ్యక్తి విదేశాల్లో ఏ ప్రాంతం నుంచి ఏ విమానంలో ప్రయాణించింది, సీటు నెంబరు, పొరుగు సీటులోని వ్యక్తితో మాట్లాడారా ? లేదా ? అనే అంశాలన్నింటిని కోవిడ్‌ నియంత్రణ బృందాలన్నీ నమోదు చేసుకున్నాయి. మన దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో ఎన్ని గంటలకు దిగింది, అక్కడే ఎంతసేపు గడిపారు. మీతోపాటు ఎవరైనా స్థానికులు కలిశారా ? అనే వివరాలను నమోదు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి స్వస్థలానికి చేరుకునేంత వరకు ప్రయాణంలో ఏ ఏ వాహనాలు ఎక్కారు, ఎక్కడెక్కడ దిగారు, అలా ప్రయాణిస్తున్నప్పుడు మీరు ప్రయాణించే వాహనంలో ఎంత మంది ఉన్నారనే వివరాలన్నింటిని ఆరా తీస్తు న్నారు. విదేశాల్లో ఎక్కడి నుంచి ప్రయాణం ఆరంభించి, స్వస్థలం చేరుకునే వరకు పరిస్థితులను రికార్డు చేశారు. ఇతరులతో ఆ వ్యక్తి చెబుతున్న వివరాలను వలంటీర్‌ ధ్రువపరుస్తున్నారు. ప్రతీ వెయ్యి మందికి ఆశా వర్కరు, రెండు వేల మందికి ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌, అంగన్‌వాడీలు వివరాల సేకరణకు సైనికుల్లా పని చేశారు. జిల్లావ్యాప్తంగా తొలి దశలోనే అనారోగ్యంగావున్న మూడు వేల మందిని ఈ బృందాలు గుర్తించాయి. వీరందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. వారికి కరోనాపై అవగాహన కల్పించి, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచించారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై చెప్పడంతో ఈ వ్యాధిపై మరింత అవ గాహన వచ్చింది. ఇది పల్లెల్లో చైతన్యం, స్ఫూర్తి నింపగా పట్టణాల్లో ఒకింత తక్కు వగా కనిపిస్తోంది. జిల్లావ్యాప్తంగా కొద్ది రోజుల వ్యవధిలోనే కొవిడ్‌ నియంత్రణ ఆరోగ్య బృందాలు చేసిన మహాయజ్ఞం సత్ఫలితాలను ఇస్తోంది.

Updated Date - 2020-03-28T10:24:42+05:30 IST