ఆటోలో వెళ్తున్న విదేశీ మహిళను ఆపిన పోలీసులు.. డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు ఆమె పర్స్ చెక్ చేసి చూడగా.. అందులో ఏమున్నాయంటే..

ABN , First Publish Date - 2022-04-17T09:15:15+05:30 IST

ఒక విదేశీ మహిళ తన కొడుకు చికిత్స కోసం భారతదేశం వచ్చింది. ఒకరోజు రాత్రి ఆమె ఆస్పత్రి నుంచి వస్తుండగా.. దారిలో కొందరు పోలీసులు ఆపి ఆమె పర్సులో డ్రగ్స్ ఉన్నాయని అనుమానంతో చెక్ చేశారు...

ఆటోలో వెళ్తున్న విదేశీ మహిళను ఆపిన పోలీసులు.. డ్రగ్స్ ఉన్నాయని పోలీసులు ఆమె పర్స్ చెక్ చేసి చూడగా.. అందులో ఏమున్నాయంటే..

ఒక విదేశీ మహిళ తన కొడుకు చికిత్స కోసం భారతదేశం వచ్చింది. ఒకరోజు రాత్రి ఆమె ఆస్పత్రి నుంచి వస్తుండగా.. దారిలో కొందరు పోలీసులు ఆపి ఆమె పర్సులో డ్రగ్స్ ఉన్నాయని అనుమానంతో చెక్ చేశారు. కానీ అందులో డ్రగ్స్ దొరకలేదు. అందులో ఏం ఉన్నాయంటే..


ఆమె ఇరాక్‌కు చెందిన మహిళ.. పేరు సమీరా సాహిబ్.. తన కొడుకు, పదేళ్ల అహ్మద్ హుసామ్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు.. అతనికి చికిత్స చేయించుకునేందుకు ఆమె బాగ్దాద్ నుంచి ఢిల్లీ వచ్చింది.. కొన్ని రోజులుగా అహదాహియా సెక్టార్-1లో నివసిస్తోంది.. రోజూ కేన్సర్ హాస్పిటల్‌కు కొడుకును తీసుకెళ్లి తీసుకు వస్తూ ఉంటుంది. 


గత సోమవారం సాయంత్రం 5:45 గంటల సమయంలో ఆమె తన కొడుకుతో కలిసి రెస్టారెంట్‌లో డిన్నర్ చేయడానికి వెళుతోంది. ఇద్దరూ హోటల్ రాడిసన్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. మార్గమధ్యంలో వారి వాహనాన్ని ముగ్గురు వ్యక్తులు ఆపారు. వారు పోలీస్ యూనిఫామ్‌లో ఉన్నారు. వారి వెనకాల పోలీస్ జీప్ కూడా ఉంది. మీ పర్సులో డ్రగ్స్ ఉన్నాయని సమాచారం వచ్చిందని చెక్ చేయడం మొదలుపెట్టారు. చెక్ చేసిన తర్వాత పర్సు ఇచ్చేసి వెళ్లిపోయారు. 


సమీర తన పర్సు తీసి చూడగా అందులో ఉండాల్సిన 4800 డాలర్లు కనిపించలేదు. దీంతో ఆమె కౌశాంబి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మోసం గురించి సమీరా ఇరాక్ ఎంబసీ అధికారులకు కూడా తెలియజేసింది. వారు భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఆ ప్రాంత ఎస్పీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 


Updated Date - 2022-04-17T09:15:15+05:30 IST