Abn logo
Mar 27 2020 @ 02:15AM

బాధ్యత మరిచిన డాక్టర్‌!

  • విదేశాలకు వెళ్లొచ్చి వైద్యం చేస్తున్న వైనం
  • సెల్ఫ్‌క్వారంటైన్‌కు వెళ్లాలని పోలీసుల ఆదేశం

సూళ్లూరుపేట, మార్చి 26: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో సామాన్యుల నుంచి వీఐపీల దాకా అందరూ అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటే.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఎముకల వైద్యుడు రవికాంత్‌రెడ్డి మాత్రం బాధ్యత మరిచి ప్రవర్తించారు. ఇటీవల ఖజికిస్థాన్‌ వెళ్లి ఈనెల 13న వచ్చిన ఆయన సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లకుండా ఆస్పత్రి తెరిచి ప్రజలకు వైద్యం చేస్తున్నాడు. దీనిపై ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్యులు రమణయ్య, సిబ్బందితో వెళ్లి ఆ డాక్టర్‌ను నిలదీశారు. తాను విదేశాలకు వెళ్లివచ్చింది నిజమే కానీ.. తనకు కరోనా లక్షణాలు లేవని రవికాంత్‌రెడ్డి వారితో వాదనకు దిగాడు. అయినా కరోనా వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పి మందలించిన పోలీసులు, అధికారులు ఆస్పత్రిని మూయించారు. సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. 

Advertisement
Advertisement
Advertisement