బాలుకు విదేశీమీడియా నివాళులు

ABN , First Publish Date - 2020-09-26T07:31:59+05:30 IST

చెన్నైలో శుక్రవారం కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకి విదేశీ మీడియా ఘనంగా నివాళులు అర్పించింది...

బాలుకు విదేశీమీడియా నివాళులు

ఆయన సంగీత సేవల్ని గుర్తుచేస్తూ వార్తలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: చెన్నైలో శుక్రవారం కన్నుమూసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకి విదేశీ మీడియా ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన మరణవార్తతోపాటు, ఆయన సినీ నేపథ్య సంగీత సంగీతానికి చేసిన సేవలను కొనియాడింది. బహుభాషల్లో పాటలు పాడి ఎస్పీబీ సంగీత ప్రియుల హృదయాలను దోచుకున్నారని సీఎన్‌ఎన్‌ ఇంటర్నేషనల్‌ కొనియాడింది. ఆయన సాధించిన ఆరు జాతీయ అవార్డుల్ని గల్ఫ్‌ న్యూస్‌ ప్రముఖంగా ప్రస్తావించింది.  కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్‌ సంగీత దర్శకత్వంలో 12 గంటల్లో 21 పాటల్ని రికార్డు చేసిన బాలు ఘనతను ఈ సందర్భంగా  గుర్తుచేసింది. ఇళయరాజా, బాలు, జానకి కాంబినేషన్‌లో 1980లో వచ్చిన మెజార్టీ పాటలన్నీ హిట్స్‌ అయ్యాయని గల్ఫ్‌ న్యూస్‌ ప్రస్తావించింది. ఖలీజ్‌  టైమ్స్‌ కూడా బాలుకు ఘన నివాళులు అర్పించింది. న్యూయార్క్‌ పోస్ట్‌  కూడా బాలు అస్తమయం వార్తను ప్రచురించింది. 

Updated Date - 2020-09-26T07:31:59+05:30 IST