బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. అనంతరం ముంబై హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్‌ను సంపాదించాడు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పటి నుంచి విదేశీ మీడియా సంస్థలు ఇంటర్వ్యూ ఇవ్వాలని షారూక్ ఖాన్‌ను సంప్రదిస్తూనే ఉన్నాయి. నిజాలు వెల్లడిచాలని ఆ మీడియా సంస్థలు కోరుతున్నాయి. కానీ, కింగ్ ఖాన్ మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు తన స్పందనను తెలుపలేదు.
బ్రిటన్, అమెరికాకు చెందిన మీడియా సంస్థలు షారూక్ ఖాన్‌ను ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుతున్నాయి. డ్రగ్స్ కేసు సున్నితమైన అంశం కావున ఈ ఉదంతంపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. అందువల్ల ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని తెలుస్తోంది. షారూక్ మెనేజర్ పూజ దడ్లానీని విదేశీ మీడియా సంస్థలు తరచుగా సంప్రదించి ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం.
తన కొడుకు డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పటి నంచి కింగ్ ఖాన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సెప్టెంబరు 19న వినాయక చవితి సందర్భంగా ఆయన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అనంతరం ఎటువంటి పోస్ట్‌ను కూడా షేర్ చేయలేదు. ఈ కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన అభిమానులు, ఇతరులకు థ్యాంక్స్ చెబుతూ ఒక మెసేజ్‌ను పంచుకోనున్నట్టు మీడియా తెలుపుతోంది.