హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అంతర్జాతీయ, ఇద్దరు దేశీయ ప్రయాణికుల నుంచి రూ. 70.95 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను సీజ్ చేసినట్లు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
విదేశీ మార్క్ ఉన్న బంగారు బిస్కెట్ల ఫోటోలను ట్వీట్ చేశారు. సీజ్ చేసిన బంగారు బిస్కెట్లు 1.38 కిలోల బరువు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితులు విమానంలో దుబాయ్ నుంచి విశాఖపట్నం, ఆపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నారని అధికారులు పేర్కొన్నారు.