తెలుకుంచికి విదేశీ విహంగాలు

ABN , First Publish Date - 2022-06-25T04:36:07+05:30 IST

జిల్లాకు విదేశీ అతిథులొచ్చాయి. తేలుకుంచి గ్రామానికి సైబీరియన్‌ పక్షుల తాకిడి ప్రారంభమైంది. ఏటా నాలుగు నెలల పాటు విదేశీ పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. సంద్రాలు, మంచుకొండలు, కారడవులు దాటుకొని ఇక్కడకు చేరుకుంటున్నాయి. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. పండులాంటి ఎర్రటి ముక్

తెలుకుంచికి విదేశీ విహంగాలు
చెట్లపై సేదదీరుతున్న సైబీరియన్‌ పక్షులు


ఇచ్ఛాపురం రూరల్‌, జూన్‌ 24 :
జిల్లాకు విదేశీ అతిథులొచ్చాయి. తేలుకుంచి  గ్రామానికి సైబీరియన్‌ పక్షుల తాకిడి ప్రారంభమైంది. ఏటా నాలుగు నెలల పాటు విదేశీ పక్షులు ఇక్కడకు వస్తుంటాయి. సంద్రాలు, మంచుకొండలు, కారడవులు దాటుకొని ఇక్కడకు చేరుకుంటున్నాయి. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. పండులాంటి ఎర్రటి ముక్కుతో వయ్యారంగా ఎగురుతూ అల్లరి చేస్తున్నాయి. వేకువజామున కిలకిలరావాలతో గ్రామస్థులను మేలుకొలుపుతున్నాయి. నాలుగు నెలల పాటు ఇక్కడే గూళ్లు అల్లుకొని.. గుడ్లు పెడతాయి. పొదిగిన తరువాత పిల్లలను స్వదేశానికి వెళతాయి. కాగా విదేశీ పక్షులను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు వస్తున్నారు.




Updated Date - 2022-06-25T04:36:07+05:30 IST