మరో దారి లేక వెళ్లిపోతున్నాం

ABN , First Publish Date - 2022-04-19T18:08:51+05:30 IST

నాలుగేళ్లుగా బదిలీ కాలేదు. అప్పుల బాధ ఎక్కువైంది. బ్యాంకు రుణం రాలే దు. ఈ పరిణామాలతో మరో దా రిలేక వెళ్లిపోతున్నామంటూ

మరో దారి లేక వెళ్లిపోతున్నాం

అప్పుల బాధతో బ్యాంకు ఉద్యోగిని దంపతుల బలవన్మరణం 

నగరి: నాలుగేళ్లుగా బదిలీ కాలేదు. అప్పుల బాధ ఎక్కువైంది. బ్యాంకు రుణం రాలే దు. ఈ పరిణామాలతో మరో దా రిలేక వెళ్లిపోతున్నామంటూ బ్యాంకు ఉద్యోగిని దంపతులు గౌరి (28), శివనాగభాస్కర్‌రెడ్డి (30) బలవన్మరణానికి పాల్పడ్డా రు. నగరిలోని ఇంట్లో ఆదివారం రాత్రి గౌరి, శివనాగభాస్కర్‌రెడ్డి ఉరేసుకున్నారు. సోమవారం ఉదయం 10 గంటలైనా గౌరి బ్యాంకుకు వెళ్లకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తలుపు లు పగులగొట్టి చూడగా ఉరేసుకుని ఉన్నట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. అతడి ది కడపజిల్లా వీరప్పనాయినిపల్లి మండలం మైలుచెరువు. ఆమెది ఎర్రగుంట్ల గ్రా మం. ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. నగరిలోని యూనియన్‌ బ్యాంకులో (గతం లో ఆంధ్రాబ్యాంకు) ఆమె క్యాషియర్‌.


అతడు హైదరాబాదులోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. తమకు ఈ పరిస్థితి రావడానికి దారితీసిన పరిస్థితులను గౌరి డైరీలో రాసుకున్నారు. ఆ ప్రకారం. పెళ్లయి ఆరు నెలల నుంచి ఉద్యోగ రీత్యా మేము వేర్వేరుగా ఉన్నాం. బదిలీ కాలేదు. నాలుగేళ్లుగా ఎదురుచూసి ఓపిక పోయింది. బాధ్యతలు తప్ప సంతోషం లేదు. కాస్త బిజీగా ఉంటే బాధలకు దూరంగా ఉండొచ్చని 2019 ఆగస్టులో రూ.5 లక్షల చీటీలు మొదలు పెట్టాం. 2020 మార్చి వరకు బాగానే నడిచింది. కరోనా లాక్‌డౌన్‌తో చీటీల వాళ్లు డబ్బు ఇవ్వలేదు. మోసం చేశారు. ఇది మా జీవితాన్నే దూరం చేసింది. డబ్బు అడగాలంటే మొహమాట పడే మేము అందరినీ అడిగాం. ఎవరూ ఇవ్వలేదు. పిల్లలకోసం అన్నీ భరించి ఉన్నాం.


కానీ డబ్బు సర్దుబాటు కాలేదు. ఎవరూ సహాయం చేయలేదు. చివరగా హౌసింగ్‌ లోన్‌ కోసం ఎంతో ప్రయత్నిం చా. ప్రొద్దుటూరు, ముద్దనూరు, నగరి మేనేజర్లను అడిగా. క్లర్కుకు రూ.40 లక్షల రుణం వస్తాది. నాకు రూ.15 లక్షలు ఇచ్చినా మా ప్రాబ్లమ్స్‌ పోతాయని చెప్పినా లోను ఇవ్వలేదు. ఒక బ్యాంకు ఉద్యోగి ఎక్కడికి వెళ్లతారు.. లోను ఇవ్వకపోవడానికి కారణం ఏమిటో తెలియడంలేదు. మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. మా చేతుల్లో ఏమీ లేదు. కాబట్టి వెళ్లిపోతున్నాం. ఇది కావాలని మేము చేయలేదు. దారిలేకే చేశాం. మమ్మల్ని క్షమించండి... అంటూ అమ్మ, నాన్న, వదిన, అత్త పేరిట డైరీలో ఆమె రాసుకున్నారు. 


అనాథలైన చిన్నారులు 

గౌరి, శివనాగభాస్కర్‌రెడ్డి దంపతులకు నాలుగేళ్ల వృత్తిక, ఏడాదిన్నర కుసుమంతరెడ్డి పిల్లలు. తల్లిదండ్రుల మృతితో ఈ చిన్నారులు అనాథలయ్యారు. వీరిని 17 రోజుల కిందట మేనత్త ఇంటికి పంపించారని బంధువులు చెబుతున్నారు. విషయం తెలిసి వారి బంధువులు కడప నుంచి సాయంత్రం ఆరు గంటలకు నగరికి చేరుకున్నారు. అప్పు విషయమై పది రోజుల కిందట కొందరు బ్యాంకు వద్ద నిలదీయడంతో మానసికంగా కుంగిపోయారన్నారు. వీరి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-04-19T18:08:51+05:30 IST