బలవంతపు వసూళ్లు దుర్మార్గం

ABN , First Publish Date - 2021-12-05T06:13:58+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడటం దుర్మార్గమని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

బలవంతపు వసూళ్లు దుర్మార్గం
కార్యక్రమంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు


 : టీడీపీ నాయకులు

అనంతపురంరూరల్‌, డిసెంబరు4: ఓటీఎస్‌ పేరుతో ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడటం దుర్మార్గమని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లిలో శనివారం ప్రజా సమస్యలపై టీడీపీ గౌరవ సభను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు డిష్‌నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవళ్ల మురళి, అధికార ప్రతినిధి సరిపూటి రమణ, నారాయణస్వా మి యాదవ్‌, నగర అధ్యక్షుడు మారుతి కుమార్‌గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలతో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..శాసనసభను కౌవరసభగా ప్రభుత్వం మార్చిందన్నారు. నిత్యావసర ధరల నియంత్రణలో విఫ లమైందన్నారు. పెట్రోల్‌, డీజల్‌, వంట గ్యాస్‌ ధరలు మండిపోతున్నాయన్నారు. రైతులు పంట నష్టాలతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయారన్నారు. ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాలని, రైతులకు పంట పరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ నాయకులు కేశవరెడ్డి, ఆదినారాయణచౌదరి, టీఎనటీయూసీ పార్లమెంట్‌ అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు లక్ష్మీనరసింహులు, మాజీ కార్పొరేటర్‌ శేఖర్‌, రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రఘునాథ్‌, మహేష్‌రాయల్‌, ముక్తియార్‌, టీఎనఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ, టీఎనటీయూసీ నగర అధ్యక్షుడు పూల బాష, నాయకులు జేఎం బాష, శ్రీనివాసచౌదరి, దాదు, నారాయణస్వామి, బుజ్జి, రజాక్‌, పవన, ఓంకార్‌ రెడ్డి, తహీర్‌ మున్నా, బాబా, నాగరాజునాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-05T06:13:58+05:30 IST