నీటి వృథాకు.. ‘చెక్‌’ డ్యాములు

ABN , First Publish Date - 2022-05-28T05:33:59+05:30 IST

జిల్లాలో సాగు నీటి ఇక్కట్లకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

నీటి వృథాకు.. ‘చెక్‌’ డ్యాములు

రూ. 331 కోట్లతో నిర్మాణాలు 

వాగుల్లో సమృద్ధిగా నీటి నిల్వలు

జిల్లాలో అదనంగా 30 వేల ఎకరాలకు సాగు నీరు

పెరగనున్న భూగర్బ జలాలు

చేపల పెంపకానికి అనుకూలం

జగిత్యాల, మే 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగు నీటి ఇక్కట్లకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. మండు వేసవి లోనూ జలకళను సంతరించుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో మత్తడి దూకుతూ నీరు ప్రవహిస్తోంది. వృథాగా పోతున్న వర్షపునీటికి అడ్డుకట్ట వేస్తూ చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో వాగులు, కాలువల ద్వారా నీరు గోదావరిలోకి వృథాగా పోకుం డా సర్కారు చర్యలు చేపట్టింది. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 

జిల్లా వ్యాప్తంగా 75 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం...

వాగుల్లోంచి వృథాగా వెళ్లే నీటికి అడ్డుకట్ట వేయడానికి నిర్మించిన చెక్‌ డ్యామ్‌లు ఫలితాలిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల రూ. 331 కోట్ల వ్యయంతో 75 చెక్‌ డ్యామ్‌లను వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. ఇందులో కొన్నింటి   పనులు పూర్తి  కాలేదు. అధిక మొత్తంలో చెక్‌ డ్యామ్‌ పనులు పూర్తయ్యా యి. ప్రస్తుత సీజన్‌లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు వరద నీటి తో పొంగిపొర్లుతున్నాయి. వాగుల మద్యలో చెక్‌ డ్యామ్‌లు నిర్మించడం వ ల్ల నీరు వృథాగా వెళ్లకుండా అడ్డుకట్ట పడుతోంది. దీంతో వాగుల్లో వరద నీరు నిల్వ ఉంటోంది. వాగుల్లో నిర్మించిన చెక్‌ డ్యామ్‌ల వల్ల జిల్లాలో దాదాపుగా 3 టీఎంసీల నీరు అదనంగా నిల్వ ఉంటుందన్న అంచనాలు న్నాయి. సుమారు 30 వేల ఎకరాలకు అదనంగా సాగు నీరు అందుతోంది.

మండు వేసవిలోనూ నిండుగా...

వర్షాకాలంలో వర్షపు నీరు వాగులు, కాలువల ద్వారా గోదావరిలో కలిసి వృథాగా పోయేది. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణంతో నీటి నిల్వలతో పాటు సమీప ప్రాంతాల్లోనూ భూగర్బ జలాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత వేసవిలోనూ జలకళతో దర్శనమిస్తున్నాయి. పంటల సాగుతో పాటు చేపల పెంపకానికి అనుకూలంగా మారుతున్నాయి. అదేవిధంగా వాగులు, కాలువల నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు సైతం చెక్‌ పడనట్లయింది. 

విరివిగా నిర్మాణాలు....

అయిదు నియోజకవర్గాల్లో 75 చెక్‌ డ్యామ్‌లను గత ఏడాదికాలంగా జిల్లాలో నిర్మించారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ. 331 కోట్ల నిధులను కేటాయించింది. జగిత్యాల నియోజకవర్గంలో గల అనంతారం వాగులో రూ. 25.53 కోట్ల నిధులతో 12 చెక్‌ డ్యామ్‌లను, పెద్దవాగులో రూ. 77.71 కోట్ల నిధులతో 9 చెక్‌ డ్యామ్‌లను, సదజల వాగులో రూ. 6.90కోట్ల నిధు లతో 2 చెక్‌ డ్యామ్‌లను నిర్మించారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌ పల్లి - కోరుట్ల పెద్దవాగు రూ. 55.50 కోట్ల నిధులతో 17 చెక్‌ డ్యామ్‌లను నిర్మించారు. చొప్పదండి నియోజకవర్గంలోని పూడూరు వాగులో రూ. 84.85 కోట్ల నిధులతో 17 చెక్‌ డ్యామ్‌లు, ధర్మపురి నియోజకవర్గంలోని సదజల వాగులో రూ. 44.95 కోట్ల నిధులతో 9 చెక్‌ డ్యామ్‌లు, పెద్దవాగు లో రూ. 24.65 కోట్ల నిధులతో 4 చెక్‌ డ్యామ్‌లు, జంగల్‌ నాలా రూ. 3.5 కోట్ల నిధులతో ఒక చెక్‌ డ్యామ్‌లను నిర్మించారు. 

నీటి నిల్వతో బహుళ ప్రయోజనాలు...

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల వాగుల్లో పారే నీటికి అడ్డుకట్ట వేయ డానికి నిర్మించిన చెక్‌ డ్యామ్‌ వల్ల నీటి నిల్వలు ఎక్కువగా ఉండను న్నాయి. దీంతో వాగులకు ఇరువైపుల కొద్ది దూరం పాటు భూగర్భ జలా లు పెరుగుతున్నాయి. సంవత్సరమంతా వాగుల్లో నిల్వ ఉండే నీటిని రైతులు మోటార్ల ద్వారా పంటలకు మళ్లించుకునే అవకాశాలున్నాయి. వాగు కట్టలకు ఇరువైపులా గ్రావిటి కాలువలను తవ్వి పంటలకు సాగు నీరు అందే వీలుంటుంది. వాగుల్లో చెక్‌ డ్యామ్‌లతో అడ్డుకట్టలు కట్టడం వల్ల నీటి నిల్వలుండడంతో పాటు వరద ముంపు సైతం తగ్గుతుంది. చెక్‌ డ్యామ్‌ నిర్మించిన ప్రతీ ప్రాంతంలోనూ 4 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు నీరు నిలిచి ఉంటోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో చేపల పెంపకం సైతం జరుపుకోవడానికి వీలుంటుంది.

గోదావరిలోకి వృథాగా వెళ్లే జలాలకు చెక్‌....

జిల్లాలో ప్రతీ యేటా సగటును 950 ఎంఎం వర్షం కురుస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో గల వాగులు సీజన్‌లో నీటితో కలకలలాడు తుంటాయి. వరద నీరు ఎక్కువయిన సందర్బాల్లో వాగుల్లో నుంచి నీరు వృథాగా గోదావరిలోకి వెళ్తోంది. వాగుల నుంచి వృథాగా గోదావరిలోకి వెళ్లే జలాలను నివారించడానికి అనుగుణంగా అడ్డుకట్టలను నిర్మించారు. దీం తో గోదావరిలోకి వెళ్లే మిగులు జలాలు వాగుల్లోనే పలు ప్రాంతాల్లో నిల్వ ఉండే అవకాశాలున్నాయి. వాగుల్లో చెక్‌ డ్యామ్‌ల వద్ద నిల్వ ఉన్న నీటిని అవసరాలను బట్టి స్థానికులు సద్వినియోగం చేసుకునే అవకాశాలుంటు న్నాయి. జిల్లాలో మరో 200 చెక్‌ డ్యామ్‌లు అవసరమవుతాయన్న అంచ నాలున్నాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం నిధులు మంజూరు చే యాలని రైతాంగం కోరుతోంది. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం వల్ల బహుళ ప్ర యోజనాలు అందుతుండడంతో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయా లని డిమాండ్‌ ఉంది. 

నీటి సమస్య తీరుతోంది

 డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్యే, జగిత్యాల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా వాగులు, కాలువల్లో నిర్మి స్తున్న చెక్‌ డ్యామ్‌ల వల్ల నీటి సమస్య తీరుతోంది. చెక్‌ డ్యామ్‌ల వద్ద నీటి నిల్వలు ఉంటున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు సైతం పెరుగు తున్నాయి. 

వేసవిల్లోనూ జలకళను సంతరించుకుంటోంది

- దారిశెట్టి రాజేశ్‌, సర్పంచ్‌, మాదాపూర్‌, కోరుట్ల మండలం

వృథాగా వెళ్తున్న నీటికి అడ్టుకట్ట వేయడానికి ప్రభుత్వం నిధులు వె చ్చించి నిర్మించిన చెక్‌ డ్యామ్‌ల వల్ల బహుళ ప్రయోజనాలు అందుతు న్నాయి. నీటి నిల్వలు పెరుగుతున్నాయి. వేసవిలోనూ పలు ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంటోంది. 


Updated Date - 2022-05-28T05:33:59+05:30 IST