ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-08-06T09:08:05+05:30 IST

వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక షెడ్యూల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిలో భాగంగా ఓటరు జాబితా సవరణకు ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ సీఈవో శశాంక్‌ గోయల్‌ ఒక ప్రకటనను విడుదల చేశారు. దీని ప్రకారం.. ఈ ఏడాది నవంబరు 1 నుంచి 30 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 9 నుంచి అక్టోబరు 31 వరకు బ్లాకు స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా పరిశీలన చేస్తారు. రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న వారికి ఒక చోట ఓటును తొలగిస్తారు. అలాగే.. పోలింగ్‌ కేంద్రాల వారీగా రేషనలైజేషన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-08-06T09:08:05+05:30 IST