Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాణిపాక బ్రహ్మోత్సవాలకు.. అంకురార్పణ

చిత్తూరు: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం అంకురార్పణ చేశారు. అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఉన్న మూషిక పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూషిక పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేసి.. బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలకు ఆహ్వానం అందించారు. 21 రోజుల పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలి తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. అనంతరం 12 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement