ఎకిల్‌స్టోన్ ‘సిక్సర్’
వ్యాట్ సెంచరీ
సెమీస్‌లో సౌతాఫ్రికా చిత్తు
మహిళల వన్డే వరల్డ్‌కప్
క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ప్రపంచ కప్ ఫైనల్‌కు దూసుకుపోయింది. గురువారం ఏకపక్షంగా జరిగిన రెండో సెమీఫైనల్లో ఆ జట్టు 137 పరుగులతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. తద్వారా ఆరోసారి మెగా టోర్నీ తుది పోరుకు చేరిన హీథర్ నైట్ సేన ఆదివారం జరిగే ఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. డానీ వ్యాట్ (129) సెంచరీతో, డంక్లీ (60) హాఫ్ సెంచరీతో చెలరేగిన వేళ తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 293 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో తీవ్ర ఒత్తిడికి లోనైన సౌతాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. డు ప్రీజ్ (30) టాప్ స్కోరర్‌కాగా..గూడల్ (28) ఓ మోస్తరుగా రాణించింది. లెఫ్టామ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ (6/36) కెరీర్ అత్యుత్తమ బౌలింగ్‌తో సఫారీల పనిపట్టింది.