రెండో విడత ఐటీఐ అడ్మిషన్లకు

ABN , First Publish Date - 2022-08-19T03:56:49+05:30 IST

రెండో విడత ఐటీఐ అడ్మిషన్లకు

రెండో విడత ఐటీఐ అడ్మిషన్లకు

- దరఖాస్తుల ఆహ్వానం 

ఎచ్చెర్ల, ఆగస్టు 18: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో రెండో విడత సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అడ్మిషన్ల జిల్లా కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ కేఎస్‌ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏ ఐటీఐలో సీటు కావాలనుకుంటున్నారో, ఆ ఐటీఐలన్నింటికీ అప్లై అనే ఆప్షన్‌ ఇవ్వాలన్నారు. ఇంతకు ముందు రిజిస్టర్‌ అయిన విద్యార్థులు అప్లై అనే ఆప్షన్‌ ఇస్తే సరిపోతుందన్నారు. ప్రత్యేకించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా సమీపంలోని ఏదైనా ఐటీఐలో సర్టిఫికెట్లను  పరిశీలన చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు ఈ నెల 29న, ప్రైవేటు ఐటీఐల్లో చేరేందుకు ఈ నెల 30వ తేదీన ఏదైనా ఐటీఐలో అభ్యర్థులు ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. జిల్లాలో  మూడు ప్రభుత్వ ఐటీఐ (ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పలాస)లు, 20 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. 

Updated Date - 2022-08-19T03:56:49+05:30 IST