రోమ్ నగరపాలక కమిటీకి ఎన్నికైన ఎన్నారై..చరిత్రలో తొలిసారిగా..

ABN , First Publish Date - 2021-10-30T22:16:13+05:30 IST

రోమ్ నగర మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి ఓ భారతీయ మహిళ ఎన్నికయ్యారు. ఇటలీజాతీయులు అధికంగా ఉండే ఓ ప్రాంతం నుంచి కేరళకు చెందిన తెరిసా పుథూర్ ఇటీవల ఈ అరుదైన ఘనత సాధించారు.

రోమ్ నగరపాలక కమిటీకి ఎన్నికైన ఎన్నారై..చరిత్రలో తొలిసారిగా..

ఇంటర్నెట్‌డెస్క్: రోమ్ నగర మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి ఓ భారతీయ మహిళ ఎన్నికయ్యారు. ఇటలీజాతీయులు అధికంగా ఉండే ఓ ప్రాంతం నుంచి కేరళకు చెందిన తెరిసా పుథూర్ ఎన్నికయ్యారు.  ఓ భారతీయ మహిళ మున్సిపల్ కౌన్సిల్ కమిటీకి ఎన్నిక కావడం ఇదే తొలిసారని సమాచారం. వృత్తి రీత్యా నర్స్ అయిన తెరిసా దాదాపు 35 ఏళ్ల క్రితం రోమ్‌కు వలస వెళ్లారు. గత పదిహేనేళ్లుగా ఆమె అక్కడ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాగా.. వైద్య రంగంలో తెరిసా చూపిన ప్రతిభాపాటవాలు, చేసిన సేవ ఆమెను ప్రజలకు దగ్గర చేసాయి. తెరిసా భర్త పేరు వక్కచ్చన్ జార్జ్. ఆయన కొచ్చికి చెందిన వారు. వారికి డేనియల్, వెరోనికా అనే ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబమంతా సెలవులకు భారత్‌కు వచ్చి వెళుతుంటారు.

Updated Date - 2021-10-30T22:16:13+05:30 IST