కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు శాసో్త్రక్తంగా ధ్వజారోహణం

ABN , First Publish Date - 2021-04-22T06:56:12+05:30 IST

ఏకశిలా నగిరి కోదండరాముని బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10.15 గంటల వరకు మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర బద్ధంగా టీటీడీ అర్చకులు గరుడపటాన్ని ప్రతిష్ఠించి శాసో్త్రక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు.

కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు  శాసో్త్రక్తంగా ధ్వజారోహణం
ధ్వజారోహణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న టీటీడీ అర్చకులు

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 21 : ఏకశిలా నగిరి కోదండరాముని బ్రహ్మోత్సవాలు బుధవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10.15 గంటల వరకు మిథున లగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర బద్ధంగా టీటీడీ అర్చకులు గరుడపటాన్ని ప్రతిష్ఠించి శాసో్త్రక్తంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవ కలశ పంచామృతాభిషేకం చేసి సకలదేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఆలయ ప్రధాన అర్చకుడు రాజేష్‌ కుమార్‌ భట్టర్‌ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం చేశారు. అనంతరం శ్రీరామ నవమి, పోతన జయంతిని నిర్వహించారు. కొవిడ్‌-19 వ్యాప్తి నేపధ్యంలో ధ్వజారోహణ ఘట్టాన్ని ఏకాంతంగా జరిపారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టువసా్త్రలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో రమే్‌షబాబు, ఏఈవో మురళీధర్‌, సూపరింటెండెంట్లు వెంకటాచలపతి, వెంకటేశయ్య, టెంపుల్‌ ఇనస్పెక్టర్‌ ధనుంజయులు, సీఐ హనుమంతునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


శేష వాహనంపై దర్శనమిచ్చిన సీతారాములు

బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజైన బుధవారం రాత్రి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు శేషవాహనంపై దర్శనమిచ్చాడు. సాయంత్రం 6గంటలకు స్వామి వారికి ఊంజల్‌ సేవ నిర్వహించిన అనంతరం 8గంటల నుంచి 9.30గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా వాహనసేవను టీటీడీ అర్చకులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు.

Updated Date - 2021-04-22T06:56:12+05:30 IST