మోడుబారిపోయినట్టు కనిపిస్తున్న ఈ చెట్టుకు 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-30T00:03:26+05:30 IST

మామూలు చెట్లకే కాపలా పెట్టలేని పరిస్థితిలో మోడుబారిన చెట్టుకు కాపలా ఏంటని ఆశ్యర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే. మోడుబారిన చెట్టుకు 24గంటలూ సెక్సూరిటీ.. అది కూడా వంతులేసుకుని మరీ కాపలా కాస్తున్నారు..

మోడుబారిపోయినట్టు కనిపిస్తున్న ఈ చెట్టుకు 24 గంటలూ సెక్యూరిటీ.. ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటంటే..

మామూలు చెట్లకే కాపలా పెట్టలేని పరిస్థితిలో మోడుబారిన చెట్టుకు కాపలా ఏంటని ఆశ్యర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే. మోడుబారిన చెట్టుకు 24గంటలూ సెక్సూరిటీ.. అది కూడా వంతులేసుకుని మరీ కాపలా కాస్తున్నారు. రియల్‌ఎస్టేట్ మాఫియా ఈ చెట్టును నరికేయాలని చూస్తోందని, రక్షణ బాధ్యతలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను కూడా కోరినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ చెట్టంటే గ్రామస్తులకు ఎందుకు అంత ప్రేమ, ఇంతకీ ఆ చెట్టు స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం..


ఢిల్లీ ఆలిపూర్‌ సమీపంలోని ఖాంపూర్‌ గ్రామానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 2,000 జనాభా ఉన్న ఈ గ్రామం.. ఇటీవల చురుగ్గా అభివృద్ధి చెందుతోంది. గ్రామ పరిసరాల్లో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేస్తూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే.. ఈ గ్రామ పరిసరాల్లో పురాతన మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టును గ్రామస్తులు మొదటి నుంచీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. ఈ చెట్టుకు  సుమారు 120 ఏళ్ల చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ చెట్టు బాగుంటే గ్రామం బాగుంటుందని తమ నమ్మకమని తెలిపారు. అయితే ఇటీవల రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఈ చెట్టును నరికి ప్లాట్లు వేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇంటి ముందు పార్క్ చేసిన కారు చోరీ.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్.. రాత్రిపూట కారును దొంగిలించింది ఎవరో తెలిసి..


గతంలో పలుమార్లు చెట్టు కొమ్మలను నరికేశారన్నారు. అయితే గ్రామస్తులు గుర్తించి అడ్డుకోవడంతో వెనుదిరిగారని చెప్పారు. అప్పటి నుంచి వంతుల వారీగా 24గంటలూ చెట్టుకు కాపలా ఉంటున్నట్లు తెలిపారు. అలాగే చెట్టుకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను కోరామన్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారుల కారణంగా గ్రామం చుట్టూ ఉన్న పచ్చదనం క్రమక్రమంగా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, మర్రి చెట్టుకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని అటవీశాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం..

ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..!

Updated Date - 2022-01-30T00:03:26+05:30 IST