రుచికి, ఆరోగ్యానికి...

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

అన్ని వంటల్లోనూ కరివేపాకు వాడతా. అయితే చాలామంది కూరల్లో వేసిన కరివేపాకును తినేటప్పుడు పక్కకు తీసిపారేస్తుంటారు.

రుచికి, ఆరోగ్యానికి...

అన్ని వంటల్లోనూ కరివేపాకు వాడతా. అయితే చాలామంది కూరల్లో వేసిన కరివేపాకును తినేటప్పుడు పక్కకు  తీసిపారేస్తుంటారు. కానీ కరివేపాకు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటంటే...


ఉదయం బ్రేక్‌ఫాస్టుకు ముందర కొన్ని కరివేపాకు ఆకుల్ని నోట్లో వేసుకుని అరగంటపాటు నమిలితే జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. తెల్ల వెంట్రుకలు రావు.

కొన్ని కరివేపాకు ఆకుల్ని  పరగడుపున తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలను కరివేపాకు తగ్గిస్తుంది.

నిత్యం వీటిని నమలడం వల్ల శరీరంలోని మలినాలు పోయి బరువు తగ్గుతారు.

కంటిచూపు ఆరోగ్యంగా ఉండడమే కాదు శరీరంలోని కొవ్వు ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. 

డయేరియా తగ్గుతుంది.  కాలేయ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తుంది. కిడ్నీలో తలెత్తే నొప్పి, ఇతరత్రా సమస్యల నివారణకు  ఉపయోగపడుతుంది.

ఠ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఎన్నో ఉన్నాయి. 

ఠ రక్తప్రసరణను మెరుగుపడుతుంది. మధుమేహులకు 

కరివేపాకు ఎంతో మంచిది.

ఠ కొందరికి మార్నింగ్‌ సిక్‌నెస్‌ ఉంటుంది. ఇంకొందరు తరచూ వికార సమస్యతో బాధపడుతుంటారు. వీటికి కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది. 

ఠ కరివేపాకులో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల శరీరంలో ఐరన్‌ లోపం తలెత్తదు.  

ఠ అందమైన చర్మానికి సైతం కరివేపాకు పనికివస్తుంది.

ఠ కొన్ని కేన్సర్ల నివారణలో కరివేపాకు కీలకంగా తోడ్పడుతుంది. రక్తహీనతను తగ్గించడంలోనూ, గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST